మహబూబాబాద్ : మహబాబూబాద్(Mahabubabad )జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత (Swimming)కు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు(Children died). ఈ విషాదకర సంఘటన తొర్రూరు మండలం అమ్మాపురం(Ammapuram pond)లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికలు ఊర చెరువులో మునిగి 10, 12 ఏండ్ల వయసు ఉన్న ఇద్దరు బాలురు మృతి చెందారు. అప్పటి వరకు తమ కండ్ల ముందే తిరిగిన పిల్లలు.. విగతజీవులుగా మిగలడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.