హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రంజాన్ వేళ విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. శ్మశాన వాటికలో విద్యుద్ఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. అయితే, ఇద్దరు బాలురు మూడు రోజుల కిందట అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలురు ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలోనే ఇద్దరు మృతి చెందారు. మృతులను అబ్దుల్ అజీజ్ (11), ముల్తాని బాబు (16)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.