బయ్యారం ఆగస్టు 16 : ఆనందంగా ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగత్రావుపేటకు చెందిన వాంకుడోత్ స్వరూప, జీవన్ దంపతుల కుమారుడు చక్రి(5), తేజావత్ సురేశ్ కూతురు ప్రజ్ఞ శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నారు.
పక్కనే ఉన్న బంధువు రోజా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం గుంత తీయగా వర్షాలకు నిండిపోయింది. ఈ క్రమంలో ఆ చిన్నారులు పిల్లరు గుంతలో పడిపోయా రు. తల్లిదండ్రులు గమనించి వీరిని బయట కు తీసి దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే చక్రి మృతి చెందాడు. ప్రజ్ఞ చికిత్స పొందుతున్నది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.