హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులపై సర్కార్ చిన్నచూపు తగదని, దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచారశాఖ కమిషనరేట్ ఎదుట నిరసన వ్యక్తంచేసింది. తమ సమస్యల పరిషారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తిచేసింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పీ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు, ఉచిత ఆర్టీసీ బస్సు, మెట్రోరైలు పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైల్వే పాసుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ స్వయంగా అక్రెడిటేషన్ కార్డుల జారీలో పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. యూనియన్ల పేర విభజన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీల్లో అనధికారికంగా నియమించిన వారిని తొలగించాలని, ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యూచర్‌సిటీలో ఇండ్ల స్థలాల ప్రక్రియను ప్రారంభించాలని, క్యాబినెట్ సబ్‌కమిటీకి తగిన ఆదేశాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎల్గోయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, బీ రాజశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిషారంలో జాప్యం సరికాదని, ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. డీజేఎఫ్టీ ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ.. డెస్ జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్య్రకమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గుడిగ రఘు, కార్యదర్శులు గండ్ర నవీన్, మాణిక్ ప్రభు, సలీమా, నిరంజన్, వెంకటేశ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.