హయత్‌నగర్ రూరల్, మే 03 : విజయవాడ జాతీయరహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడిఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన యశ్వంత్ (22), అదే ప్రాంతానికి చెందిన వివాహిత జ్యోతిగా పోలీసులు గుర్తించారు.
మృతదేహాలు కుళ్లిపోయాయి. రెండ్రోజుల కిందటే వీరిని చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. యశ్వంత్‌కు వివాహం కాలేదు. జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఇద్దరినీ హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నదని, త్వరలోనే కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు.