జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 3 : సైబర్ నేరగాళ్లు తాజాగా జనగామ(Janagama )జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పేరిట ఫేక్ ఐడెంటిటీ(,Fake identity profile) సృష్టించి వాట్సాప్, ఫేస్ బుక్ సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు సందేశాలు పంపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా వెంటనే అప్రమత్తమయ్యారు.
సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ ఐడెంటిటీ ప్రొఫైల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఫేక్ ఐడెంటిటీ ప్రొఫైల్ వాట్సాప్, ఫేస్ బుక్ నుంచి తన పేరిట వచ్చే సందేశాలకు ప్రజలు ఎవరు కూడా స్పందించొద్దని కలెక్టర్ సూచించారు. స్థానిక సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.