సుబేదారి, ఫిబ్రవరి03 : భార్య, కుటుంబ సభ్యులపై భర్త కత్తితో దాడి కిపాల్పడిన సంఘటన సోమవారం అర్ధ రాత్రి హనుమకొండ సుబేదారి పోలీసు స్టేషన్ పరిధి న్యూ శాయం పేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అఖిల్ మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన టెన్త్ క్లాస్మేట్ సజ్వితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు.
భార్య భర్తల మధ్య గొడవలు కారణంగా భర్తకు దూరంగా సజ్విత తల్లిదండ్రుల వద్ద ఉంటూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. కాగా, సోమవారం రాత్రి అఖిల్ కత్తితో న్యూ శాయం పేటలోని భార్య ఇంటికి వెళ్లి గొడవ పడి దాడి చేయగా సజ్వితతో పాటు తన సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఇద్దరు ప్రైవేట్ హాస్పిటట్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితున్ని పట్టుకొని కేసు నమోదు చేశారు.