హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉన్నదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బ్రహ్మోత్స వ ఏర్పాట్లపై ఈవో అధికారులతో సోమవా రం సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తామని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెం బర్ 18న ధ్వజారోహణం ఉంటుందని, ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్ర్తాలు సమర్పిస్తారని వెల్లడిం చారు. బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్టు చెప్పారు. స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు.