పసుపు @ రూ.15 వేలు ఈ సీజన్లో ఇదే రికార్డు
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి.
మెట్పల్ల్లి, ఏప్రిల్ 15 : పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి. పసుపు కాడి (కొమ్ము) రకానికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.15 వేలు, కనిష్ఠంగా రూ.9,111, గోళ (మండ) రకానికి గరిష్ఠంగా రూ.13,388, కనిష్ఠంగా రూ.9,002, చూర రకానికి గరిష్ఠంగా రూ.10,511, కనిష్ఠంగా రూ.7,796 ధర పలికింది. కాగా కాడి, గోళ రకాలకు ఈ సీజన్లో ఇప్పటివరకు పలికిన ధరల్లో ఇదే అధికం కావడం విశేషం. అయితే, ఇవే ధరలు కొనసాగుతాయా? మళ్లీ తగ్గుముఖం పడుతాయా? అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే రైతుల దగ్గరి నుంచి 80 శాతానికి పైగా పసుపు అమ్మకం జరిగి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రైతుల నుంచి భారీగా పసుపు రాగా కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని పలుమార్లు రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. మెజార్టీ శాతం పసుపు అమ్మకం పూర్తయ్యాక ధర పెరగడం వల్ల ఒరిగే ప్రయోజనం లేదని రైతులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

