హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): రైతులకు త్వరితగతిన కొత్త పంట రుణాలు మంజూరు చేయాలని సహకార బ్యాంకులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం ఆయన కోఠిలోని తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టీజీక్యాబ్)ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీతోపాటు బ్యాంక్ పనితీరు, ఆర్థిక అంశాలపై సమీక్షించారు. డీసీసీబీల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీక్యాబ్ నూతన డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కంచారు. సమావేశంలో టీడీక్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.