హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): తాను సభ్యుడిగా ఉన్న సబ్‌కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులకు సంబంధం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాళేశ్వరంపై సబ్‌కమిటీ వేశారని, దీనిపై తాను సంతకం చేసినట్టుగా కాళేశ్వరం కమిషన్‌కు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. ఆయన వాంగ్మూలాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులైన ప్రాణహిత, దేవాదుల, కంతనపల్లి, సమ్మక్క సారక్కపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై మాత్రమే సబ్‌కమిటీ వేశారని అన్నారు. కాళేశ్వరం అనుమతులకు, సబ్‌కమిటీకి సంబంధం లేదని చెప్పారు.