హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆదాయానికి దక్షిణాది రాష్ర్టాలే వెన్నెముకగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. 2018 నుంచి 2023 వరకు ఐదేండ్లలో దేశవ్యాప్తంగా కేంద్రం రూ.90.80 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తే, దక్షిణాది రాష్ర్టాలకు ఇచ్చింది కేవలం రూ. 22.86 లక్షల కోట్లు మాత్రమే అని వివరించారు. దక్షిణాది రాష్ర్టాలకు రూపాయి కి 30 పైసలే ఇస్తున్న కేంద్రం.. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలకు రూ.4 చొప్పున ఇవ్వడం విభేదాలను సృష్టించడం కాదా..? అని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను యుద్ధప్రాతిపదికన చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి కి లేఖ రాశారు. 4లక్షల మందికిపైగా రిటై ర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డీఏ లు పెండింగ్‌లో ఉంచిందని, గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.