హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం సిట్ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేస్తూ కొందరు ఎస్ఐబీ అధికారులు ఆయన వ్యక్తిగత ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ విషయంపైనే మంత్రి వాంగ్మూలం రికార్డు చేశారు. ఇదే కేసులో వాంగ్మూలం తీసుకునేందుకు కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.