హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): పర్యాటకులకు మెరుగైన భద్రత కల్పించడం కోసం టూరిస్టు పోలీసులను నియమించినట్టు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ మేరకు 80మంది టూరిస్టు పోలీసులకు పర్యాటకుల భద్రత అంశంపై ఈనెల 6 నుంచి 11వరకు నిర్వహించిన ఓరియంటేషన్, సెన్సిటైజేషన్ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు ఈనెల 13 నుంచి విధుల్లో ఉండాలని ఆదేశించారు.
పెద్దపల్లి కలెక్టర్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు
కోల్‌సిటీ, అక్టోబర్11 : పెద్దపల్లి కలెక్టర్‌పై శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేశామని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఉపాధ్యక్షుడు మైస రాజేశ్ తెలిపారు. జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ నిరాకరించడంపై దళితులు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.