హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ)ః వెంకటేశ్వర భక్తి చానల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని చానల్ కార్యాలయంలో శుక్రవారం ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత విసృ్తతంగా ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
బర్డ్ దవాఖానలో నెలకు 25 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్‌ను 14రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్టు చెప్పారు.