TSTET-2023 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రైమరీ కీ విడుదలైంది. ఈ నెల 23 వరకు ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టెట్ కన్వీనర్ పేర్కొన్నారు. tstet.cgg.gov.inలో ప్రాథమిక కీని అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. ఈ నెల 15న విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది చేసుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహించింది. తాజాగా టెట్‌కు సంబంధించి ప్రైమరీ కీని విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనున్నది.