హైదరాబాద్ : మామిడిపండ్ల ప్రియులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బంగినపల్లి మామిడి పండ్లు గడప వద్దకే చేర్చనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రకాల వస్తువుల కార్గో, పార్శిల్ సేవలు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ఈ వేసవిలో ప్రత్యేకంగా మామిడిపండ్ల హోం డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. కేజీ రూ.115కు తాజా బంగినపల్లి మామిడి పండ్లు రైతుల తోట నుంచి నేరుగా ఇండ్లకు చేర్చనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం తెలిపారు.
అయితే, కనీసం 5 కేజీల పార్సిల్ బుక్ చేసుకోవాలని సూచించారు. 5, 10, 15, లేదా టన్ను వరకు కూడా పార్సిల్ బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసిన వారం రోజుల్లో పార్సిల్‌ను ఇంటికి చేర్చుతామని పేర్కొన్నారు. బుకింగ్ కోసం ‘www.tsrtcparcel.in’ వెబ్సైట్లో లేదా ‘www.tsrtconline.in’ లేదా 040-2345003, 040-69440000 నంబర్లలో సంప్రదించాలని కోరారు.