హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రతి గురువారం బస్ డే పాటించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎండీ సజ్జానర్ ఇవాళ.. టెలిఫోన్ భవన్ నుంచి బస్ భవన్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో సజ్జనార్ ముచ్చటించారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, శుభ్రత, సౌకర్యాలపై ఆరా తీశారు. బస్సు ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతమైందని సజ్జనార్ పేర్కొన్నారు.
As part of #tsrtcbusday initiative, travelled to work in #TSRTC bus.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 9, 2021
To improve the quality of our services & to have personal feedback from passengers,every #ThursdayMorning our staff working in #TSRTC shall travel only by our buses.Share your pics while you plying in #TSRTCBus pic.twitter.com/gAqvkkdW3j