హైదరాబాద్/సుల్తాన్‌బజార్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయస్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గానుగాపూర్తోపాటు పండరీపూర్, తుల్జాపూర్‌కు ఈ సర్వీస్‌ను నడుపుతున్నారు. 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బస్సు గానుగాపూర్ బయలుదేరుతుంది.
17వ తేదీన దత్తాత్రేయ దర్శనానంతరం మధ్యాహ్నం12 గంటలకు అకడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు పండరీపూర్‌కు చేరుకుంటుంది. అకడ పాండురంగడి దర్శనం పూర్తవగానే రాత్రి 10 గంటలకు తుల్జాపూర్ వెళ్తుంది. తుల్జాభవాని దర్శనానంతరం 18న మధ్యా హ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు ఎంజీబీస్‌కు చేరుకుంటుంది. టికెట్ ధర రూ.2500గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు సెల్‌ఫోన్ నంబ ర్లు 94405 66379, 99592 26257, 99592 24911 ద్వారా టీఎస్ ఆర్టీసీ అధికారులను సంప్రదించవచ్చు.