హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల పోస్టర్లను నిషేధించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
అభిరామ్ అనే ఓ జర్నలిస్టు.. ఆర్టీసీ బస్సులపై అంటించే ఆశ్లీల పోస్టర్ల విషయాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజన్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బస్సులపై ఇలాంటి పోస్టర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చర్యలు తీసుకుంటానని సజ్జనార్ ప్రకటించారు. ఇచ్చిన ప్రకటన మేరకు ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల ఫోటోలను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.
In order to Prevent #disfigurement & objectionable Posters on #RTC Buses #MD @TSRTCHQ Sri #VCSajjanar #IPS has Passed instructions to all Officers to Remove all such Kind of Posters immediately #ActNow#Revolution #publictransport@TelanganaCMO @KTRTRS @puvvada_ajay @DonitaJose pic.twitter.com/Zhfn9ImKj4
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) September 16, 2021