హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు టీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. ఈ పండుగకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 4 వేల బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా దాదాపు 55 లక్షలకు పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు టీఎస్ ఆర్టీసీ చేర్చింది. దీంతో టీఎస్ ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ఇదే విధంగా టీఎస్ ఆర్టీసీ సంస్థను ఆదరిస్తూ, సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.