హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య విద్యార్థులు ైైస్టెఫండ్ కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీ-ఎస్ఆర్డీఏ) మద్దతు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డీ శ్రీనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో చదివే ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెఫండ్ ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెడికోలకు మద్దతుగా శనివారం నల్ల బ్యాండ్లు ధరించి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.