TSPSC | హైదరాబాద్ : భూగర్భ జలశాఖ(గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్) లో ఖాళీగా ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. గెజిటెడ్ కేటగిరి పోస్టులకు జులై 18, 19 తేదీల్లో, నాన్ గెజిటెడ్ పోస్టులకు జులై 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షా సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.