హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం టీఎస్పీఎస్సీ ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది.
రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, భారీ సంఖ్యలో అభ్యర్థులు పోడీ పడటంతో ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు పకడ్బందీగా చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఈ నెలలోనే గ్రూప్-4 ప్రాథమిక కీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. 8,039 గ్రూప్4 ఉద్యోగాలకు 7,62,872 మంది అభ్యర్థులు ఈ నెల 1న పరీక్ష రాశారు.