హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. నిరుడు జూలై 7న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. నిరుడు జూలై 13 నుంచి 15 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించింది. నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేసింది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in.వెబ్సైట్లో సంప్రదించాలని కమిషన్ పేర్కొన్నది.
వెటర్నరీ సర్జన్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలోని వెటర్నరీ సర్జన్ క్లాస్ ఏ, బీ ఉద్యోగాల భర్తీకి కమిషన్ నిరుడు జూలై 13, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించింది. ఆగస్టు 17 నుంచి 19 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. ఫైనల్ కీ పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in.వెబ్సైట్లో సంప్రదించాలని కమిషన్ పేర్కొన్నది.