ప్రాణమున్న నేస్తం
అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు ఒక సంగీత నాదం! కుటుంబ వైభవం అంటే ఆ మొదటి ఏడుపే అన్నట్టు ఈ ఆనందం అవధులు దాటి అమందానంద సందోహమై పేరు పెట్టే పండుగగా వెల్లివిరుస్తుంది బంధుకోటి సభ్యమైన దీవెనలు మందస్మితాలై ఊయలలూపుతుంటాయి
అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు
ఒక సంగీత నాదం!
కుటుంబ వైభవం అంటే
ఆ మొదటి ఏడుపే అన్నట్టు
ఈ ఆనందం అవధులు దాటి
అమందానంద సందోహమై
పేరు పెట్టే పండుగగా వెల్లివిరుస్తుంది
బంధుకోటి సభ్యమైన దీవెనలు
మందస్మితాలై ఊయలలూపుతుంటాయి
పూలు రాలినట్టు ఆ చిరునవ్వులు
అమృతాభిషేకం చేస్తుంటే
అమ్మమ్మ నాన్నమ్మ తాతల దీవెనలు
కణతలకు అద్దుకునే చేతి చిటికెలవుతాయి
చిన్నారి పాదాలు
నడకల తన్మయత అయినప్పుడు
ఆ లోగిలి మొత్తం
నవ్యలోకాలలో తేలుతుంది
పసి హృదయం
ముసలి బంధాల వింత
కొన్ని జీవితాల్లో బంగరు
ముడి అవుతుంది
అవును …ఆ నిశ్శబ్దపు ఇంట
చిరుసవ్వడి తెచ్చిన అమ్మ గర్భపు గుడిని
మంగళదాయని అని అందామంటూ
ప్రాంగణమే ఆ ఇంటి వ
సంత వేదిక అవుతుంది
ఆ ఇంటి శిశిరాల
శీతలమే నవజాత శిశువు!
నడకలు నేర్చిన ముద్దు మురిపాల నుండి
నైర్మల్య భావస్పర్శల ప్రేమ పాఠశాల నుండి
చదువుల అభినందనల వరకు
తూర్పు మెరుపులు కావచ్చు
తెలివెన్నెల చల్లందనమూ కావచ్చు
సహజాతి సహజ కోపతాపాల
లయాన్విత దృశ్యాలూ ఎదురవుతుంటాయి
హృదయాలూ కలలూ కలగసి
కష్టాలవైనా నవ్వులవైనా
కన్నీళ్లు జాలువారి
హెచ్చుతగ్గుల సంగీతము అవుతుంది
అన్నిటికన్నా ఉద్యోగ
సద్యోగాల పయనాలలో
సాధ్యాసాధ్యలెదురైనప్పుడు
ఒక కర్తవ్యం ఎన్నో విశ్వాసాలు
అవినాభావ సమ్మేళనం అవుతుంది
వావి వరసల అవతారాలుగాను
కుటుంబము ఒక
నైపుణ్య నిర్మాణం అవుతుంది
ఇవేవీ సంపూర్ణ త్యాగాలు కావు
ఇవేవీ జయాపజయాల
చిట్టాపద్దులూ కావు
ఆశీస్సులుగా అవతరించిన తోడు
నిన్నటి త్యాగాలకు నాంది కూడా అవ్వచ్చు
గడుస్తున్న గహనమైన రోజులలో
మెట్లు దిగకుండా పైకి ఎదిగే ప్రయాణంలో
తామూ పదోన్నతి పొందాలని
భుజాలకు బాధ్యతలను అప్పగించే పెద్దలు ఉండాలి ఆ ఇంట్లో!
ఆశయాల శిఖరాలను తాకాలని
నువ్వు తపిస్తున్న వేళల్లో
అమ్మగానూ నాన్నగానూ
విజయ సోపానం ఎక్కిన సందర్భాలలో
సాధించిన సంపాదనల ప్రగతి పథంలో
గృహ సముదాయమూ
వృత్తి సముదాయమూ
రెండింటిలో మహానందం అయ్యేదేదంటే
వెలుగు రేఖ వంటి ఇంటి పరివారమే !
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

