ఆమెకు వ్యక్తిత్వం పట్ల అభిరుచి. మానవత్వం పట్ల అభిరుచి. సమాజ హితవు పట్ల అభిరుచి. ఇవన్నీ ఒక పార్శ్వం అయితే భాష పట్ల, సాహిత్యం పట్ల, సాహిత్యంలోని వివిధ ప్రక్రియల పట్ల వల్లమాలిన అభిరుచి ఉండటం మరో పార్శ్వం.
కాల గమనం చాలా విచిత్రమైనది.మనుషుల జీవితాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో చూస్తుంటాం. కానీ, మన రజిత అనే భావం వల్లనేమో.. అనిశెట్టి రజిత మరణాన్ని భరించలేకపోతున్నాం.