హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ (జీఆర్) జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు.
అర్హులైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతామని, ఆ మేరకు త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో 247 లెక్చరర్ల భర్తీకి 2022 డిసెంబర్ 7న నోటిఫికేషన్ జారీ కాగా, నిరుడు సెప్టెంబర్ 4 నుంచి 6, తిరిగి 8న రాత పరీక్షలు నిర్వహించారు.