TSPSC | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అత్యధిక అభ్యర్థులు గ్రూప్4 పరీక్ష రాయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాలతో పాటు పలు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మహిళా అభ్యర్థులను తనిఖీ చేసేందుకు తప్పనిసరిగా మహిళా అధికారులను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఈసారి గ్రూప్4 పరీక్షలో బయోమెట్రిక్‌కు బదులు థంబ్ అటెండెన్స్ తీసుకోనున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి 33 జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే వారిని శాశ్వతంగా కమిషన్ పరీక్షల నుంచి డిబార్ చేస్తామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే హెచ్చరించిన విషయం విదితమే.
| జిల్లా | హెల్ప్‌లైన్ నంబర్ |
| ఆదిలాబాద్ | 18004251939 |
| నిజామాబాద్ | 9948958655, 9948371748 |
| కరీంనగర్ | 18004254731 |
| హనుమకొండ | 18004251115, 08702530833 |
| ఖమ్మం | 08742-234544 |
| హైదరాబాద్ | 040-23201575 |
| రంగారెడ్డి | 04023235642, 04023235643 |
| మెదక్ | 9391942254, 08452223360 |
| నల్లగొండ | 18004251442 |
| మహబూబ్‌నగర్ | 08542 252202 |
| సంగారెడ్డి | 08455 272233 |
| కుమ్రంభీ ఆసిఫాబాద్ | 18005991200 |
| మంచిర్యాల | 08736-250501 |
| నిర్మల్ | 1800-425-5566 |
| కామారెడ్డి | 9989957607 |
| జగిత్యాల | 18004257620 |
| పెద్దపల్లి | 9000913593 |
| రాజన్న సిరిసిల్ల | 9398684240 |
| వరంగల్ | 18004253424, 9154252936 |
| జనగామ | 6303928718 |
| మహబూబాబాద్ | 7995074803 |
| జయశంకర్ భూపాలపల్లి | 9030632608 |
| ములుగు | 1800-425-0520 |
| భద్రాద్రి కొత్తగూడెం | 08744241950, 9392919706 |
| యాదాద్రి భువనగిరి | 9121147135 |
| సూర్యాపేట | 6281492368 |
| మేడ్చల్ మల్కాజిగిరి | 9492409781 |
| సిద్దిపేట | 087457 230000 |
| జోగులాంబ గద్వాల్ | 7993499501 |
| వనపర్తి | 08545-233525 |
| నాగర్ కర్నూల్ | 08540 230201 |
| నారాయణపేట | 9154283914 |
| వికారాబాద్ | 7995061192 |
ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సాధించాలన్న పట్టుదలలో అభ్యర్థులు ఉన్నారు. ఇందుకు మొదటిరోజే భారీ సంఖ్యలో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడమే నిదర్శనం. గ్రూప్4కు మొత్తం 9,51,204 దరఖాస్తులు రాగా, మొదటిరోజే 5,50,171 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొన్నారు. కాగా, చివరి నిమిషంలో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొంటే తలెత్తబోయే ఇబ్బందులను టీఎస్పీఎస్సీ వివరిస్తున్నది. ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపిస్తూ.. ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నది.