హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తన స్థాయిని దిగజారి సీఎం కేసీఆర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. మోదీ ని ఆహ్వానించడానికి రావద్దని గతంలో ప్రధానమంత్రి కార్యాలయమే చెప్పిందని, ఇప్పుడు మాత్రం తనను చూడటానికి కేసీఆర్ భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి సరికాదని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా అనేకమార్లు విషం కక్కిన మోదీ తాజాగా కేసీఆర్‌పై విషం క క్కారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 2014 నుంచి ఏ పార్టీతోనూ పొ త్తు పెట్టుకోలేదని, పెట్టుకోదని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించార ని గుర్తు చేశారు. 119 స్థానాలకు 115 స్థా నాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర కేసీఆర్‌ది అని, అభ్యర్థుల కోసం వె తుక్కునే పరిస్థితిలో బీజేపీ ఉన్నదని ఎద్దే వా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు.