TS Weather Update | రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్ వివరించింది.