TS Weather Update | తెలంగాణలో గురువారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలున్నాయని చెప్పింది. దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి మూడు డిగ్రీలకుపైగా పెరిగే అవకాశాలున్నాయని వివరించింది.