TS Weather Update | తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగాలులు వీచే అవకాశాలు, పలు జిల్లాల్లో వానలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.