TS Weather | మాడుపలిగేలా ఎండలు.. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45.4 డిగ్రీలు..!
TS Weather | తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నానికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. ఎండలతో జనం జంకుతున్నారు.
TS Weather | తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నానికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. ఎండలతో జనం జంకుతున్నారు. మరో వైపు రాగల ఐదురోజుల్లోనూ వేడి, తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని.. అదే సమయంలో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.
ఆ తర్వాత అశ్వాపురం (కొత్తగూడెం) 45.3, మంగపేట (ములుగు) 45.3, తిమ్మాపూర్ (నల్గొండ) 45.2, కొత్తపల్లి గోరి (భూపాలపల్లి) 45.2, ధర్మవరం (ములుగు) 45.2, ఇబ్రహీంపేట (నల్గొండ) 45.1, అలుబాక-జెడ్ (ములుగు) 45.1, పాన్గల్ (వనపర్తి) 45.1, మాటూర్ (నల్గొండ) 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ విభాగం వివరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

