రామగిరి, డిసెంబర్ 28 : ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గడియారం సెంటర్ నుంచి లక్ష్మి గార్డెన్స్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ప్రారంభోపన్యాసం చేశారు.
ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క శ్రీనివాస్, ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు సంయుక్త, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, జేఎన్‌యూ పూర్వ అధ్యక్షురాలు అయిషీఘోష్ తదితరులు ప్రసంగించారు. కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేసినప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. సినీ గేయ రచయిచ సుద్దాల అశోక్‌తేజ పాటలతో అలరించారు.