వీధి వ్యాపారులకు రుణాల్లో తెలంగాణ టాప్
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నాయి. మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.695 కోట్ల రుణాలు అందజేయడం విశేషం. రెండో విడత రుణాల పంపిణీలో దేశంలోని తొలి పది స్థానాల్లో అన్నీ తెలంగాణకు చెందిన పట్టణాలే నిలవడం విశేషం.
- లక్ష లోపు జనాభా క్యాటగిరీలో తొలి 10 స్థానాలు మనవే
- 40 లక్షల జనాభా క్యాటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమం
- రాష్ట్ర అధికారులకు అవార్డులు అందజేసిన కేంద్ర మంత్రి
- తెలంగాణలో మొత్తం రూ.695 కోట్ల రుణాలు పంపిణీ
హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నాయి. మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.695 కోట్ల రుణాలు అందజేయడం విశేషం. రెండో విడత రుణాల పంపిణీలో దేశంలోని తొలి పది స్థానాల్లో అన్నీ తెలంగాణకు చెందిన పట్టణాలే నిలవడం విశేషం. లక్ష నుంచి పది లక్షలలోపు జనాభా ఉన్న పట్ణణాల క్యాటగిరీలో మొదటి మూడు స్థానాలు తెలంగాణకే దక్కాయి.
మూడో విడత రుణాల పంపిణీలో నలభై లక్షలకు పైగా జనాభా ఉన్న క్యాటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నది. గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి చేతుల మీదుగా తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య అవార్డులు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వీధివ్యాపారులకు రుణాలు అందజేయాలని, స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 ఫిబ్రవరి 24న ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌శాఖ వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా వల్ల నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారికి వర్కింగ్ క్యాపిటల్‌ను అందించారు. నిరంతరం మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ, అధికారులకు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో రుణాల పంపిణీ కార్యక్రమం దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో విజయవంతంగా సాగింది.
టాప్-10లో నిలిచిన తెలంగాణ పట్టణాలు
లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల క్యాటగిరీలో దేశవ్యాప్తంగా 3,555 పట్టణాలు ఉండగా తొలి పది స్థానాలను తెలంగాణ కైవసం చేసుకున్నది. ఇందులో మొదటి స్థానంలో సిద్దిపేట, రెండో స్థానంలో సిరిసిల్ల ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిర్మల్, కామారెడ్డి, బోధన్ , జహీరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, ఆర్మూర్ నిలిచాయి. లక్ష నుంచి 10 లక్షల జనాభా క్యాటగిరీలో దేశంలో 442 పట్టణాలు ఉండగా వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. నిజామాబాద్‌కు 10వ స్థానం దక్కింది. 40 లక్షలపైగా జనాభా ఉన్న క్యాటగిరీలో జీహెచ్ఎంసీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- GHMC
- loan
- street vendors
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

