TS PGECET | హైదరాబాద్ : టీఎస్ పీజీఈసెట్ -2024 ప్రవేశ పరీక్ష విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్, వరంగల్‌లో ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మ్, ఎం ఆర్క్, గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
ఈ ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన సెషన్లో జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మెటిక్స్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ సెషన్లో 7,461 మంది అభ్యర్థులకు గానూ 7179 మంది హాజరయ్యారు. 96.22 శాతం మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించిన రెండో సెషన్లో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ సెషన్‌కు 5477 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4898 మంది హాజరయ్యారు. 89.43 శాతం మంది పరీక్ష రాశారు.