హైదరాబాద్ : యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ప్రత్యేక పీజీ కౌన్సెలింగ్కు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 14న ప్రత్యేక విడుత పీజీ సీట్ల కేటాయింపు ఉంటుందన్న ఆయన.. యూనివర్సిటీ క్యాంపస్, అనుబంధ కాలేజీలో సీట్లు మాత్రమే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక విడుతలో ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీ ఉండదని స్పష్టం చేశారు.