హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లో (Madhapur) రేవ్‌పార్టీని (Rave party) పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో (Service Apartments) బుధవారం అర్ధరాత్రి సమయంలో రేవ్‌పార్టీ నిర్వహిస్తుండగా నార్కోటిక్స్ బ్యూరో (TS-NAB) అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత వెంకట్ సహా ఐదుగురు ప్రముఖులను అధికారులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయంపై ఆరాతీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్‌ను ఎవరు సరఫరా చేసారనే విషయం తేలాల్సి ఉంది.