ముషీరాబాద్, ఏప్రిల్ 22: మాదిగలకు లోక్సభ సీట్లు కేటాయించకుండా, సీఎం రేవంత్రెడ్డి వారిని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ ఆరోపించారు. సోమవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క లోక్సభ ఎంపీ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, నర్సింహ, రాజేశ్, శ్యామ్రావు, వెంకట్, నాగరాజు, ప్రవీణ్, రమేశ్, రఘు పాల్గొన్నారు.