TS Minister Satyavati Rathode | కాంగ్రెస్ మాటల పార్టీ.. బీఆర్ఎస్ చేతల పార్టీ.. సోనియా హామీలపై మంత్రి సత్యవతి రాథోడ్ మండిపాటు
TS Minister Satyavati Rathode | కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తెలంగాణ మహిళలు విశ్వసించరని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
TS Minister Satyavati Rathode | తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘విజయ భేరి’ సభ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తెలంగాణ రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమశాఖ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ బూటకపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మాటలు, కబుర్లు చెప్పే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపుతుందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్ణాటకలో అవే ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిందా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలు, తప్పుడు ప్రకటనలను తెలంగాణ మహిళలు విశ్వసించరని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తేల్చి చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెల రూ. 2500, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకు వంట గ్యాస్ సిలిండర్అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ముందు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి, ఆ తర్వాత తెలంగాణలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

