పిటిషనర్‌కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా

హైదరాబాద్ : నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు కోర్టు ఖర్చుల కింద జమ చేయాలని ఆదేశించింది. ఇరుపక్షాలు డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి నేతృత్వంలోని కో–ఆపరేటివ్ ట్రైబ్యునల్‌లో హాజరుకావాలని, మే 6 నుంచి గత ఆరు నెలల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ ట్రైబ్యునల్ తిరిగి సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశించింది.
వ్యాపారం కోసం 2005లో హైదరాబాద్‌కు చెందిన మందాడ విష్ణుదాస్ అనే వ్యక్తి పాతబస్తీలోని ఇంటి పత్రాలను తనఖా పెట్టి మర్కంటైల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌నుంచి రూ.7 లక్షలు రుణం పొందారు. అప్పు తీర్చకపోవడంతో ఇంటిని బ్యాంక్ వేలానికి పెట్టింది. అయితే ఇంటిని నిర్ణీత గడువులోగా ఖాళీ చేయించలేకపోవడంతో వేలం రద్దు అయ్యింది. ఈ పరిస్థితుల్లోనే మందాడ విష్ణుదాస్ మరణించడంతో ఆ ఇంటిని ఆయన ఇద్దరు కుమారులు పంచుకున్నారు. తండ్రి చేసిన అప్పును తీర్చాలని ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కుమారుడు సురేష్‌కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు.
తిరిగి విచారించి ఉత్తర్వులు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను డివిజన్‌బెంచ్ ఎదుట అప్పీల్ చేశారు. నిరర్ధక రిట్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేశారని పిటిషనర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించాక ట్రైబ్యునల్ ఈ కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

