హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెరమెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్యకు రూ. కోటి నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బీఎన్ రెడ్డి నగర్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మొగిలయ్య కలిసిన విషయం విదితమే.
దర్శనం మొగిలయ్య ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.