బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 11:36:27

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

తిరుమల : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకొన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గవర్నర్ దంపతులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో గవర్నర్ తిమిళసై దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో దేశంపై ఆధారపడకుండా మనం సొంతంగా వాక్సిన్ తయారు చేసుకొనే శక్తిని ఇచ్చినందుకు శ్రీవారికి ధన్యవాదాలు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ ముందుకు వచ్చి వాక్సిన్ వేసుకోవాలని పిలునిచ్చారు. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాల గోల్డెన్‌జూబ్లీ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, శ్రీకాళహస్తి చేరుకుంటారు. సాయంత్రం 6.25 గంటలకు హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.


VIDEOS

logo