TS EAMCET | 28న ఎంసెట్ నోటిఫికేషన్.. మార్చి 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్, మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా..
- ఎంసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)
- దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 10 (అపరాద రుసుము లేకుండా)
- రూ.250 ఫైన్‌తో- ఏప్రిల్ 15
- రూ.1000 అపరాద రుసుముతో- ఏప్రిల్ 20
- రూ.2500 ఫైన్‌తో- ఏప్రిల్ 25
- రూ.5000 అపరాద రుసుముతో- మే 2
- దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
- హాల్‌టికెట్ల డౌన్లోడ్- ఏప్రిల్ 30 నుంచి
- పరీక్ష తేదీలు- మే 7 నుంచి 11 వరకు
పీజీఈసెట్ షెడ్యూల్..
2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్-2023 (PGECET) షెడ్యూల్‌ను కూడా ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. పరీక్షలను మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు.
- పీజీసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)
- దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 30 (అపరాద రుసుము లేకుండా)
- రూ.250 ఫైన్‌తో- మే 5
- రూ.1000 అపరాద రుసుముతో- మే 10
- రూ.2500 ఫైన్‌తో- మే 15
- రూ.5000 అపరాద రుసుముతో- మే 24
- దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
- హాల్‌టికెట్ల డౌన్లోడ్- మే 21 నుంచి
- పరీక్ష తేదీలు- మే 29 నుంచి జూన్ 1 వరకు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


