TS Budget 2023-24 | రాష్ట్రంలో నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, జిల్లాకో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కృషి చేస్తుంది. బస్తీ దవఖానాలు, పల్లె దవాఖానాలను అభివృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు. ఈ వార్షిక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
గర్భిణుల్లో పోషకాహారం తలెత్తకుండా ఉండేందుకు ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం రూ.200 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ 21న ప్రారంభించారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ప్రారంభించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రతి ఏటా దాదాపు 4 లక్షల మంది గర్భిణులు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇక, ఆరోగ్య శ్రీ పథకం కింద గత ఏడాది రూ.981 కోట్లు కేటాయించగా.. ఈ సారి దాన్ని 1,101 కోట్లకు పెంచారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ( ఈహెచ్ఎస్ ) కింద 362 కోట్లను కేటాయించారు.
మొత్తం బడ్జెట్ – రూ. 2,90,396
రెవెన్యూ వ్యయం – రూ. 2,11,685
పెట్టుబడి వ్యయం – రూ. 37,525
నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖకు రూ. 9,599 కోట్లు
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు..
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు పథకానికి రూ. 15,075 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 3,210 కోట్లు
దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
ఆయిల్ పామ్‌కు రూ. 1000 కోట్లు
అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ 2023-24 లైవ్ అప్డేట్స్
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ బడ్జెట్ | వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ : మంత్రి హరీశ్‌రావు