కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీఫామ్స్ అందజేశారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం బీఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సీఎం కేసీఆర్ తరఫున గంప గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు.
అదేవిధంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరఫున కల్వకుంట్ల కవితకు బీఫామ్ ఇచ్చారు. మాతృ వియోగం కారణంగా మంత్రి వేముల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫున బీఫామ్‌ను కవిత తీసుకున్నారు. కాగా, మొత్తం 51 మంది అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. మిగతా స్థానాలకు బీఫామ్స్ సిద్ధమవుతున్నాయని సీఎం చెప్పారు.