TS Assembly Elections | సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల తారకరామారావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు. 29,687 ఓట్ల మెజారిటీ కేటీఆర్ గెలుపొందారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. 2009 నుంచి సిరిసిల్ల ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2009, 2010 ఉప ఎన్నికలు, 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.