హైదరాబాద్: నగర శివార్లలోని పెద్దఅంబర్‌పేట (Pedda Amberpet) దగ్గర ఆవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. డీసీఎం డ్రైవర్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆవులను ఆలేటి ఆశ్రమ గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.