ఈటల రాజేందర్‌ది ఆత్మ వంచన : కేటీఆర్
కేటీఆర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన అని పేర్కొన్నారు. ఈటల తనకు తాను మోసం చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎంత గౌరవిమిచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టారు. ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారు. ఈటలపై అనామకుడు లేఖ రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదు’ అని కేటీఆర్ తెలిపారు.
మంత్రిగా ఎందుకు కొనసాగారు?
ఐదేళ్ల క్రితమే ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటే మంత్రిగా ఎందుకు కొనసాగారు? ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా కేసీఆర్ మంత్రిగా ఉంచారు. ఈటల టీఆర్ఎస్లో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించాను. రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు కూడా కమలాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏ ఎన్నికైనా పార్టీల మధ్యనే..
ఏ ఎన్నికైనా పార్టీల మధ్యే.. వ్యక్తుల మధ్య కాదు అని కేటీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది అని స్పష్టం చేశారు.
బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు?
బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి? ప్రజలకు ఏం అన్యాయం చేశామని పాదయాత్ర చేస్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చింది? జలజీవన్ మిషన్ కింద అన్ని రాష్ర్టాలకు నిధులు ఇస్తుంది. తెలంగాణకు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

